ప్రియుడి ఇంటిముందు ప్రియురాలి ఆత్మహత్యాయత్నం..ఆస్పత్రికి తరలింపు

ప్రియుడి ఇంటిముందు ప్రియురాలి ఆత్మహత్యాయత్నం..ఆస్పత్రికి తరలింపు

ప్రేమించాను అని వెంటపడ్డాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఐదేళ్లు కలిసి తిరిగారు. ఇప్పుడు మరో యువతితో పెళ్లికి సిద్దం అయ్యాడు. కరీంనగర్​ జిల్లాల్లో ప్రేమించి పెళ్లి చేసుకుంటానని  నమ్మించి మోసం చేసిన యువకుడి ఇంటి ఎదుట ఆత్మహత్యా యత్నం చేసింది ఓ యువతి. వివరాల్లోకి వెళితే.. 

హుజూరాబాద్​ పట్టంలోని ఇందిరా మార్గ్​ లో నివాసం ఉంటున్న ప్రియుడి ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం చేసింది ప్రియురాలు. గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం.. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు..ఇప్పుడు వేరే యువతితో పెళ్లికి సిద్దమయ్యాడని ఆందోళన చెంది బాత్రూం లు కడిగే ఆర్పిక్​ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది యువతి. తీవ్ర అస్వస్థతకు గురైన యువతిని హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు.