పెళ్లి చేసుకుందామని యూఎస్ నుంచి వచ్చి మృతి

పెళ్లి చేసుకుందామని యూఎస్ నుంచి వచ్చి మృతి
  • కరోనా నుంచి కోలుకున్నా పాణం దక్కలే

గోదావరిఖని, వెలుగు: కరోనా నుంచి కోలుకున్నా ఓ యువతి ప్రాణం దక్కలేదు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని కృష్ణానగర్​లో ఉండే కాంట్రాక్టర్​ రవీందర్​రెడ్డి కూతురు కరీష్మారెడ్డి(28). అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఎనిమిదేండ్లుగా అక్కడే ఉంటోంది. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో 2 నెలల క్రితం ఇండియాకు వచ్చింది. వచ్చిన 10 రోజులకు కరోనా సోకడంతో హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో అడ్మిట్ ​అయ్యింది. నెగెటివ్ ​వచ్చిన 
కొన్నిరోజులకే హెల్త్​ ఇష్యూస్ ​రావడంతో హాస్పిటల్​కు వెళ్లగా టెస్టుల్లో ఊపిరితిత్తుల్లో ఇన్​ఫెక్షన్ చేరిందని తెలిసింది. అప్పటి నుంచి చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి చనిపోయింది.