- వాటర్ ట్యాంక్ నుంచి దూకి యువతి సూసైడ్
ఎల్బీనగర్, వెలుగు: ప్రేమిస్తున్నా.. పెండ్లి చేసుకుంటానని ఆటో డ్రైవర్ వెంటపడడంతో అతన్ని నమ్మిన యువతి తన ప్రేమ గురించి పెద్దలకు చెప్పి ఒప్పించుకుంది. ఆ తర్వాత అతనిపై ఆశలు పెంచుకుంది. కొద్ది రోజుల తర్వాత ఆమెపై అనుమానం పెంచుకొని యువకుడు వేధింపులకు గురి చేస్తుండడంతో తట్టుకోలేక వాటర్ ట్యాంక్ పైనుంచి దూకి మృతి చెందింది. హస్తినాపురం గాయత్రి నగర్‌కు చెందిన సభావత్ మహేశ్ అలియాస్ ఆనంద్ ఆటో డ్రైవర్.
నాగోల్‌లోని తట్టిఅన్నారం ప్రాంతానికి చెందిన ఐశ్వర్య (19)తో అతనికి పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఆమె నిరాకరించినా వదలలేదు. చివరకు ప్రేమను ఆమె ఆమోదించి పెద్దలను పెండ్లికి ఒప్పించింది. ఈ క్రమంలో ఇద్దరూ చనువుగా ఉంటున్నారు. అయితే కొద్ది రోజులుగా ఐశ్వర్యను మహేశ్ అనుమానిస్తూ వేధిస్తున్నాడు. సోమవారం ఐశ్వర్యను కలిసేందుకు వచ్చిన మహేశ్ అనుమానం వ్యక్తం చేస్తూ గొడవకు దిగాడు.
తట్టుకోలేక ఐశ్వర్య కాలనీలోని వాటర్ ట్యాంక్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఐశ్వర్య పేరెంట్స్ ఫిర్యాదుతో మహేశ్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ మగ్బుల్ జానీ తెలిపారు.
