డబ్బులివ్వకపోతే సోషల్ మీడియాలో వీడియోలు పెడతా

డబ్బులివ్వకపోతే సోషల్ మీడియాలో వీడియోలు పెడతా
  • డబ్బులివ్వకపోతే సోషల్ మీడియాలో వీడియోలు పెడతా
  • ఇన్ స్టాగ్రామ్‌‌లో యువకుడికి యువతి వేధింపులు
  • పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

గచ్చిబౌలి, వెలుగు: మార్ఫింగ్ చేసిన వీడియో కాల్స్​ను సోషల్ మీడియాలో పెడతానంటూ ఇన్ స్టాగ్రామ్​లో పరిచయమైన యువతి వేధిస్తోందని ఓ యువకుడు గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  గచ్చిబౌలిలోని ఐసీఐసీఐ  బ్యాంక్​లో పనిచేస్తున్న సాయికుమార్(26) దగ్గరలోని హాస్టల్​లో ఉంటున్నాడు. కొన్ని రోజుల కిందట ‘స్వీట్ గర్ల్ 948’ పేరుతో ఉన్న అకౌంట్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. సాయికుమార్ రిక్వెస్టును యాక్సెప్ట్ చేసి సదరు యువతితో చాటింగ్ చేశాడు. కొంతకాలం తర్వాత వీడియో కాల్స్​చేసుకున్నారు. వాటిని రికార్డు చేసుకున్న యువతి.. ఆ వీడియోలను మార్ఫింగ్ చేసి న్యూడ్​గా మార్చింది. తనకు డబ్బులు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ సాయికుమార్​ను వేధించడం మొదలుపెట్టింది. అతడి ఫ్రెండ్స్‌‌కు ఆ వీడియోలను షేర్‌‌‌‌ చేస్తానని బ్లాక్ మెయిల్ చేయడంతో గురువారం సాయికుమార్ గచ్చిబౌలి పీఎస్​లో కంప్లయింట్ చేశాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.