Delhi metro : మెట్రో రైల్లో వికృత చేష్టలు.. యువతిపై నెటిజన్ల ఆగ్రహం

Delhi metro : మెట్రో రైల్లో వికృత చేష్టలు.. యువతిపై నెటిజన్ల ఆగ్రహం

మోడ్రన్ డ్రెస్ లు వేసుకోవడం ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది. ఆ డ్రెసుల్లో ఫొటోలు దిగి లైక్ లు, కామెంట్స్ దక్కించుకొని పావులర్ అయిపోదామనుకుంటున్నారు నేటి యువత. ఈ మోజులో పడి కొందరు పిచ్చి పనులు చేస్తున్నారు. పబ్లిసిటీ, పాపులారిటీ పెరుగుతుందని పబ్లిక్ ప్లేసుల్లో అర్ధనగ్నంగా డ్రెస్ లు వేసుకుని తిరుగుతున్నారు. 

ఇలాంటి ఓ ఘటనే ఢిల్లీ మెట్రోలో జరిగింది. ఓ యువతి బికినీ టైప్ డ్రెస్ వేసుకుని మెట్రోలో ప్రయాణించింది. దాన్ని వీడియో తీసిన తోటి ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ అయింది. ఆ యువతి డ్రెస్సింగ్ స్టైల్ చూసి అంతా అవాక్కయ్యారు. బాబోయ్.. ఇదేం డ్రెస్ అని విస్తుపోయారు.  

ప్రస్తుతం ఆ వీడియో వివాదానికి కారణమైంది. వీడియో చూసిన నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా రవాణాలో వేసుకోవాల్సిన  వస్త్రధారణ గురించి సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ప్రయాణీకులకు సామాజిక మర్యాదలు పాటించలేదని, ఇతరులను కించపరిచే విధంగా బట్టలు వేసుకోవడం ఏంటని.. ఆ యువతిపై ఫైర్ అవుతున్నారు. తనపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.