పెళ్లైతే దూరమవుతామని సూసైడ్ చేసుకున్న 21 ఏళ్ల యువతులు

పెళ్లైతే దూరమవుతామని సూసైడ్ చేసుకున్న 21 ఏళ్ల యువతులు

ఆ యువతులిద్దరూ మంచి స్నేహితులు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఒకరిని విడిచి మరోకరుండలేరు. అలాంటిది వారిలో ఒకరికి పెళ్లి కుదరడంతో.. విడిపోతామనే భయంతో వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కేరళలో జరిగింది. కోల్లాం జిల్లాకు చెందిన ఆర్య అశోక్ మరియు అమృతా అనీల్ అనే 21 ఏళ్ళ కాలేజీ విద్యార్థులు ప్రాణ స్నేహితులు. అయితే అమృత కుటుంబం ఈ మద్యే ఆమెకు పెళ్లి నిశ్చయించింది. దాంతో పెళ్లైతే ఒకరికొకరు దూరమవుతారనే ఆందోళన ఇద్దరిలోనూ మొదలైంది. ఆ ఎడబాటును భరించడం కన్నా చావడమే మేలని నిర్ణయించుకున్నారు.

వీరిద్దరూ తమ డిగ్రీ సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి కాలేజీకి వెళ్తున్నామని చెప్పి శనివారం కొట్టాయం బయలుదేరారు. ఆ రోజు సాయంత్రమైనా వారిద్దరూ ఇంటికి రాలేదు. దాంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికి చాదయమంగళం పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ఉదయం వైకోమ్ జిల్లాలోని ముట్టంజాపుళా నదిలో ఇద్దరు యువతుల మృతదేహాలను స్థానిక పోలీసులు గుర్తించారు. పోలీసులు వారి కుటుంబసభ్యలకు సమాచారమివ్వడంతో వారు అక్కడికి వచ్చి మృతదేహాలను గుర్తించారు.

‘శనివారం ఎవరో నదిలోకి దూకినట్లు చూశామని ప్రత్యక్ష సాక్షి ఒకరు మాకు ఫోన్ చేశారు. దాంతో మేం నదిలో జాలర్లతో వెతికించాం. నది వద్ద నిర్మించిన బ్రిడ్జీ మీద చెప్పులను కూడా మేం గుర్తించాం. మృతదేహాలను వెతికి బయటకు తీసిన తర్వాత వారి కుటుంబసభ్యులు వారిని ఆర్య, అమృతలుగా గుర్తించారు. అమృత మృతదేహం పూచక్కల్ దగ్గర లభించగా.. ఆర్య మృతదేహం పెరుంబలం సౌత్ బోట్ జెట్టి దగ్గర లభించింది’ అని వైకోమ్ పోలీసు అధికారులు తెలిపారు. యువతుల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కొట్టాయం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

For More News..

కరోనావైరస్ ఫస్ట్ సెల్ఫ్ టెస్ట్ కిట్.. 30 నిమిషాల్లోనే రిజల్ట్

బోర్డింగ్ పాస్ ఇవ్వలేదని విమాన సిబ్బందిని కొట్టిన ఎస్సై

యాక్టర్ ఖుష్బూ కారును ఢీకొన్న ట్యాంకర్.. కారులోనే ఖుష్బూ