కుటుంబ కలహాలతో అన్నను చంపిన తమ్ముడు..మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో దారుణం

కుటుంబ కలహాలతో అన్నను చంపిన తమ్ముడు..మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో దారుణం

కోల్‌‌బెల్ట్‌‌, వెలుగు : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన అన్నను హత్య చేశాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సండ్రోనిపల్లి గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సండ్రోనిపల్లికి చెందిన మెండ్రపు గోపాల్‌‌ (35), కుమార్‌‌ అన్నదమ్ములు. ఇద్దరూ ఒకే ఇంటిలో వేర్వేరు గదుల్లో ఉంటూ కూలీ పనులు చేస్తుంటారు. 

వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇద్దరు మరోసారి గొడవ పడ్డారు. దీంతో ఆగ్రహానికి గురైన కుమార్‌‌ పక్కనే ఉన్న రోకలిబండతో అన్న గోపాల్‌‌ తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ గోపాల్‌‌ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, కుమార్‌‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.