బీఎస్పీలో చేరిన ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ తమ్ముడు

బీఎస్పీలో చేరిన ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ తమ్ముడు

అలంపూర్​ నుంచి పోటీ..

హైదరాబాద్​, వెలుగు :  బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తమ్ముడు డా.రేపల్లె ప్రసన్న కుమార్ ప్రొఫెసర్ ఉద్యోగం నుంచి వీఆర్​ఎస్​ తీసుకున్నారు.  స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసి బీఎస్పీలో చేరారు. అయితే,  పి.వి.నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయంలో పశు ఉత్పత్తి యాజమాన్య విభాగంలో ఆయన  ప్రొఫెసర్ గా విధులు నిర్వహించేవారు.

బహుజన రాజ్యాధికారమే ధ్యేయంగా ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు చెప్పారు. బీఎస్పీ అలంపూర్ అభ్యర్థిగా పోటీలో ఉంటున్నట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అలంపూర్​లో గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నట్టు వెల్లడించారు.  ప్రసన్న కుమార్​ 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు.