సోనియా గాంధీకి కెప్టెన్ భావోద్వేగ లేఖ

సోనియా గాంధీకి కెప్టెన్ భావోద్వేగ లేఖ

చండీగఢ్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ నుంచి తనను బయటకు పంపడానికి కుట్ర జరిగిందని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాతోపాటు ప్రియాంక, రాహుల్‌కు ఆయన పలు ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో 7 పేజీల లెటర్‌ను పోస్ట్ చేశారు. తాను 52 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నానని.. అయినప్పటికీ తనను, తన క్యారెక్టర్‌ను అర్థం చేసుకోలేకపోయారని కాంగ్రెస్ అధినాయకత్వంపై కెప్టెన్ ఫైర్ అయ్యారు. రాహుల్, ప్రియాంకలను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని.. వారిని తన సొంత పిల్లలుగానే ప్రేమిస్తూ వచ్చానన్నారు. గత కొన్ని నెలలుగా పార్టీ తనను తీవ్ర అవమానాలకు గురి చేసిందని.. ఇలాంటిది మరే సీనియర్ కాంగ్రెస్ నాయకుడికి జరగొద్దని ఆశిస్తున్నానని చెప్పారు. 

‘నా మీద అర్ధరాత్రి కుట్ర జరిగింది. మీతోపాటు మీ పిల్లలకు తెలిసే ఇది జరిగింది. మీ అధ్యక్షతన నాకు తెలియకుండా రాత్రి పూట ట్విట్టర్‌లో సీఎల్పీ మీటింగ్ పెట్టారు. ఏఐసీసీ ఆ మీటింగ్ పెట్టాలనుకుంటే సీఎల్పీ లీడర్‌ అయిన నాకు సమాచారం ఇవ్వాలి. కానీ నాకు తెలియకుండా పెడతారా? ఆ తర్వాతి రోజు ఈ మీటింగ్ విషయం నాకు తెలిసింది. నా మనోస్థైర్యాన్ని, ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసేందుకే ఇలా చేశారని గ్రహించా. మీరు రిజైన్ చేయమనగానే నేను పదవి నుంచి తప్పుకున్నా. ఈ మొత్తం వ్యవహారం నన్ను తీవ్ర అసంతృప్తికి, నిరుత్సాహానికి, బాధకు గురి చేసింది’ సోనియా గాంధీని ఉద్దేశించి ఆ లేఖలో అమరిందర్ అన్నారు. తాను పెట్టబోతున్న కొత్త పార్టీకి ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్‌’ అనే పేరును ఖరారు చేసినట్లు కెప్టెన్ తెలిపారు. 

మరిన్నివార్తల కోసం:

నా గెలుపుతో టీఆర్ఎస్ సిగ్గుపడాలి: ఈటల

ఇకపై ఫేస్‌బుక్‌లో ఆ ఫీచర్ బంద్

ఉప ఎన్నిక ఫలితంతో ఒరిగేదేమీ లేదు: కేటీఆర్