ప్రగతి భవన్​ ముందు యూత్​ కాంగ్రెస్​ ధర్నా

ప్రగతి భవన్​ ముందు యూత్​ కాంగ్రెస్​ ధర్నా
  • వరుస అత్యాచార ఘటనలపై నిరసన
  • సీఎం కేసీఆర్​ స్పందించాలంటూ డిమాండ్​

ఖైరతాబాద్​,వెలుగు: సీఎం క్యాంప్​ ఆఫీస్​ ప్రగతి భవన్​ ముందు యూత్​ కాంగ్రెస్​ నేతలు మెరుపు ధర్నా చేశారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న వరుస అత్యాచారాల ఘటనలను నిరసిస్తూ గురువారం ప్రగతిభవన్​ను ముట్టడించారు. ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా ఏం పట్టనంటూ సీఎం కేసీఆర్​ మౌనంగా ఉండడం సరికాదని మండిపడ్డారు. వెంటనే స్పందించాలని డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అమలవుతున్నాయా అని నిలదీశారు. జూబ్లీహిల్స్​ ఘటనలో వక్ఫ్​బోర్డు చైర్మన్​ కారులోనే అత్యాచారం జరిగినందున ఆయనను కూడా అరెస్ట్​ చేయాలని డిమాండ్​ చేశారు. ఘటనలపై మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు నోరెత్తక పోవడం బానిసత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ హోం మంత్రి మహమూద్​ అలీ,మంత్రి కేటీఆర్​ రాజీనామా చేయాలన్నారు. హైదరాబాద్​ బ్రాండ్ ఇమేజ్​ను పెంచుతామన్న కేటీఆర్​.. విచ్చలవిడిగా పబ్​లకు అనుమతిస్తూ నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్నీషియా పబ్​పై చర్యలు తీసుకోకపోవడం వెనుక కారణాలేంటని ప్రశ్నించారు. సీఎం స్పందించేదాకా నిరసనలు చేస్తామన్నారు.