ఎస్సై, కానిస్టేబుళ్ల సమస్య పరిష్కరించకుంటే ప్రగతి భవన్ ముట్టడిస్తం

ఎస్సై, కానిస్టేబుళ్ల సమస్య పరిష్కరించకుంటే ప్రగతి భవన్ ముట్టడిస్తం

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ కలెక్టరేట్ ను ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆఫీసు ముందు బైఠాయించి  ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. హైకోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం ప్రశ్నాపత్రంలో తప్పుగా వచ్చిన ప్రశ్నలకు మార్కులు కలిపి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రన్నింగ్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు సైతం మెయిన్స్లో అవకాశం కల్పించాలని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆత్మహత్య చేసుకున్న అభ్యర్థుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలని యూత్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్య పరిష్కరించకపోతే వేలాది మందితో ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.