జనగామ యువకుడికి ఇండియన్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​అవార్డు

జనగామ యువకుడికి ఇండియన్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​అవార్డు

జనగామ, వెలుగు : జనగామ జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు ఇండియన్​బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లోకి ఎక్కాడు. ఈనెల 15న ఢిల్లీలోని ఎన్​సీఆర్​లో నిర్వహించిన యాన్యువల్​ఇంటర్నేషనల్​కాన్వకేషన్​లో నిర్వాహకులు మోర్తాల దీపక్​కు ఇండియన్​ బుక్​ఆఫ్​రికార్డ్స్​ను అందించి మెడల్​తో సత్కరించారు. 

 ప్రపంచంలో అత్యంత ఎత్తైన లడక్​లోని వాహన రహదారి ఉమ్లింగ్​లా పాస్​(19,024 అడుగుల ఎత్తు), కార్థుంగ్​లా పాస్​ని(17,982 అడుగుల ఎత్తు)ను తన బైక్ పై దీపక్​2023 అక్టోబర్ 17న  అధిరోహించి రికార్డు సృష్టించాడు. అతడు మాట్లాడుతూ దేశంలో బెస్ట్​మోటార్​ సైకిల్​ సాహస యాత్రికుడిగా పేరు  సాధించడమే తన లక్ష్యమన్నారు. ఈ ఘనత సాధించిన అతడిని పలువురు అభినందించారు.