న్యూ ఇయర్ వేడుకల్లో యువకుల హల్ చల్

న్యూ ఇయర్ వేడుకల్లో యువకుల హల్ చల్

హైదరాబాద్ : సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నోవా ఫిష్టా న్యూ ఇయర్ వేడుకల్లో కొందరు యువకులు హల్ చల్ చేశారు. మద్యం మత్తులో ఒకరిపై మరొకరు బీరు బాటిల్స్, కుర్చీలతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈవెంట్ సెట్టింగ్ ని కూడా పడగొట్టడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

న్యూ ఇయర్ ​సెలబ్రేషన్స్​తో గ్రేటర్ సిటీ హోరెత్తిపోయింది. నగర వాసులంతా కొత్త ఏడాదికి గ్రాండ్​గా వెల్ కమ్ చెప్పారు. శనివారం అర్ధరాత్రి వరకు గ్రేటర్ వ్యాప్తంగా పలు ప్రాంతాలు.. జనాల కేరింతలు, వేడుకలతో సందడిగా కనిపించాయి. ఇయర్‌‌‌‌‌‌‌‌ ఎండ్​కు వీకెండ్ కూడా కలిసి రావడంతో జనాలంతా ఉదయం నుంచే సెలబ్రేషన్స్ మొదలుపెట్టేశారు. దీంతో సిటీలోని టూరిజం స్పాట్‌‌‌‌లు, మల్టీప్లెక్స్‌‌‌‌లు, మాల్స్, మార్కెట్లలో సందడి నెలకొంది. సిటీలోని లవ్‌‌‌‌ హైదరాబాద్, ట్యాంక్‌‌‌‌బండ్, నెక్లెస్ రోడ్, దుర్గం చెరువు, మల్కం చెరువు, కేపీహెచ్‌‌‌‌బీ ఐడీఎల్‌‌‌‌ లేక్, చార్మినార్‌‌‌‌‌‌‌‌, కేబుల్‌‌‌‌ బ్రిడ్జి, ఖాజాగూడ లేక్, ఇలా టూరిస్ట్ ప్లేసెస్ లో సాయంత్రం వరకు స్టూడెంట్లు, ఫ్యామిలీల రద్దీ కనిపించింది.