పబ్ లో యువత న్యూసెన్స్.. కాలనీ వాసుల ఆందోళన

పబ్ లో యువత న్యూసెన్స్.. కాలనీ వాసుల ఆందోళన

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ టాట్ పబ్ ముందు కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. నివాసాల మధ్య పబ్ నిర్వహణతో రోజూ న్యూసెన్స్ ఎక్కువైందంటూ ఆరోపించారు. రాత్రి 2 గంటల వరకు పబ్ లో మ్యూజిక్ సిస్టమ్, యువత అసభ్యకర ప్రవర్తన అభ్యంతరకరంగా ఉంటుందని.. పబ్ లో తాగిన మందు బాటిళ్లను ఇళ్లలోకి విసిరేస్తున్నారన్నాని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ పబ్ లో రేవ్ పార్టీలు, అశ్లీల డ్యాన్సులు జరిగేవని.. పలు కేసులు కూడా పబ్ పై ఉన్నాయని చెప్పారు కాలనీ వాసులు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఎక్సైజ్ పోలీసులు, లోకల్ పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.