గో గ్రీన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన యువకులు

గో గ్రీన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన యువకులు

జనగామ అర్బన్, వెలుగు: జనగామ పట్టణంలోని రెండోవార్డు సాయి రెసిడెన్సీ ప్రెసిడెంట్​స్కూల్​వెనకాల పట్టణానికి చెందిన గో గ్రీన్​ఉద్యమం చేపడుతున్న పంతం సాయి ప్రసాద్​ఆధ్వర్యంలో ఆదివారం యువకులు మొక్కలు నాటారు. యువకులు మాట్లాడుతూ పచ్చదనం కోసం 10 వేల మొక్కలను నాటడానికి పథకం రూపొందించామని తెలిపారు. కార్యక్రమంలో పంతం వసంతలక్ష్మి, సిద్దార్ధ, సాయి, చరణ్​ తదితరులు పాల్గొన్నారు.