ఇక నుంచి యూట్యూబ్ లో ఆ యాడ్స్ కన్పించవు

ఇక నుంచి యూట్యూబ్ లో ఆ యాడ్స్ కన్పించవు

వీడియో ప్లాట్‌ఫాంలలో టాప్ ఛానల్ యూట్యూబ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉచితంగా, ప్రీమియం ప్యాకేజీల ద్వారా వీడియో కంటెంట్‌ వినోదాన్ని అందిస్తోంది యూట్యూబ్‌. అయితే ఇకపై యూట్యూబ్‌ టాప్‌, హోం పేజీలో గ్యాంబ్లింగ్‌, ఆల్కాహాల్‌, పాలిటిక్స్‌, డ్రగ్స్‌కు లింకు ఉన్నయాడ్స్ కనిపించవని యూట్యూబ్‌ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. యూట్యూబ్‌ను ఓపెన్‌ చేయగానే టాప్‌లో కనిపించే ఈ యాడ్స్‌ ద్వారా గూగుల్‌కు భారీ ఆదాయం వస్తుంటుంది. ఇకపై ఆ ప్లేస్ లో యూజర్లకు పనికొచ్చేవి, అవగాహనకు సంబంధించిన యాడ్‌లే ఉండాలని యూట్యూబ్‌ నిర్ణయించింది. యూజర్ల పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు తెలిపింది. యూజర్లను తప్పుదారి పట్టించే ప్రకటనలను, అసత్య ప్రచారాలకు యూట్యూబ్‌లో స్థానం ఉండదని స్పష్టం చేసింది.

అంతేకాదు యాడ్‌లకు సంబంధించిన వీడియోల థంబ్‌నెయిల్స్‌ విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది యూట్యూబ్. ఇలాంటి ప్రకటనలు మానసికంగా యూజర్‌పై ప్రభావం చూపుతాయి. అందుకే అలాంటి యాడ్‌లను ప్రొత్సహించేది లేదంటూ తెలిపింది.