మీకు నచ్చిన యూట్యూబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పైసలియ్యొచ్చు

మీకు నచ్చిన యూట్యూబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  పైసలియ్యొచ్చు

యూట్యూబ్‌‌‌‌‌‌‌‌ తెలియని వాళ్లు ఉండరు. దాని ద్వారా మస్త్‌‌‌‌‌‌‌‌ మంది  డబ్బులు సంపాదిస్తున్నారు. సినిమావాళ్లకు ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నట్లు యూట్యూబ్‌‌‌‌‌‌‌‌ స్టార్స్ కి కూడా చాలామందే ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నారు. అలాంటివాళ్లు తమ అభిమానాన్ని చాటుకునేందుకు కొత్త ఫీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చేస్తోంది. అదే ‘సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ థ్యాంక్స్‌‌‌‌‌‌‌‌’. ఇప్పటికే ‘సూపర్‌‌‌‌‌‌‌‌ చాట్‌‌‌‌‌‌‌‌’, ‘సూపర్‌‌‌‌‌‌‌‌ స్టిక్కర్స్‌‌‌‌‌‌‌‌’ ఫీచర్స్‌‌‌‌‌‌‌‌ ఉండగా దానికి అదనంగా దీన్ని ప్రవేశపెడుతున్నారు. 

యూట్యూబ్‌‌‌‌‌‌‌‌లో వీడియోలు చూడటం, కింద కామెంట్‌‌‌‌‌‌‌‌ పెట్టడం లేదా లైక్‌‌‌‌‌‌‌‌ కొట్టడం చేస్తాం. కానీ, ఇప్పటినుంచి మన అభిమాన యూట్యూబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మనం ఫండ్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వొచ్చు. వాళ్లపై ఉన్న అభిమానాన్ని తెలియజేస్తూ వాళ్లకు డబ్బు డొనేట్‌‌‌‌‌‌‌‌ చేయొచ్చు. యూట్యూబ్‌‌‌‌‌‌‌‌ తీసుకొస్తున్న ‘సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ థ్యాంక్స్‌‌‌‌‌‌‌‌’ ఫీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా వాళ్లకు డబ్బులు పంపొచ్చని యూట్యూబ్‌‌‌‌‌‌‌‌ వర్గాలు ఒక ప్రకటనలో  చెప్పాయి. ఇండియాతో పాటు 68 దేశాల్లో దీన్ని ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు యూట్యూబ్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నీల్‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌. ‘‘ఈ ఫీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా క్రియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అదనంగా డబ్బులు వస్తాయి. వ్యూయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గట్టి సంబంధం ఏర్పడుతుంది. వీడియో కింద ‘సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ థ్యాంక్స్‌‌‌‌‌‌‌‌’కు సంబంధించి జిఫ్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. దాని పైన క్లిక్‌‌‌‌‌‌‌‌ చేసి డబ్బులు పంపొచ్చు. ఈ ఫీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాడిన వారి పేరు కామెంట్స్‌‌‌‌‌‌‌‌ సెక్షన్‌‌‌‌‌‌‌‌లో ప్రత్యేకమైన రంగులో హైలైట్‌‌‌‌‌‌‌‌ అవుతుంది. ప్రస్తుతానికి బీటా వెర్షన్‌‌‌‌‌‌‌‌ నడుస్తోంది. ఈ ఏడాది చివర్లోనే ఈ ఫీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లాంచ్‌‌‌‌‌‌‌‌ చేస్తాం” అని చెప్పారు నీల్‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌. యాప్‌‌‌‌‌‌‌‌లో, డెస్క్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌లో కూడా ఈ ఫీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుబాటులోకి రానుంది.