కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్ న్యూస్

కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్ న్యూస్

కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్‌ న్యూస్ చెప్పింది. వాళ్ల కోసం మల్టీ లాంగ్వేజ్ పేరుతో కొత్త ఫీచర్ తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ ఫీచర్‌‌తో యూజర్లు ఇతర భాషల వీడియోలను తమకు నచ్చిన భాషలో (ఆడియోలో) చూడొచ్చు. అంటే.. యూట్యూబ్‌లో వేరే భాషలో ఉన్న కొన్ని వీడియోలు అందరీ అర్థం కావు. అలాంటి వాటిని అర్థం చేసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. లేదా కంటెంట్ క్రియేటర్లు తమ వీడియోలకు మల్టీ లాంగ్వేజ్ ఫీచర్ ద్వారా వేరే భాష ఆడియోను యాడ్ చేసుకునే అవకాశం లభిస్తుంది.  

ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఫీచర్ ను వాడేందుకుగానూ సెట్టింగ్‌లో ఉన్న ఆడియో ట్రాక్‌ ఆప్షన్ క్లిక్ చేయాలి. అందులో నచ్చిన భాషను సెలక్ట్ చేస్తే ఆ భాషలో ఆడియో వినిపిస్తుంది. అయితే, యూట్యూబ్ నిర్ణయించిన కంటెంట్ క్రియేటర్లకు మాత్రమే ఈ ఫీచర్ పనిచేస్తుంది. టీవీ, మొబైల్, డెస్క్ టాప్‌లల్లో ఈ మల్టీ లాంగ్వేజ్ ఫీచర్ పనిచేస్తుంది.