టీవీల్లో యూట్యూబ్ షార్ట్స్ చూడొచ్చు

టీవీల్లో యూట్యూబ్ షార్ట్స్ చూడొచ్చు

జనాలు యూట్యూబ్ షార్ట్స్ కి ఎంతలా అలవాటు పడిపోయారో తెలిసిన విషయమే. ఖాళీ సమయాల్లో అలా షార్ట్స్ వీడియోల్ని తిరగేస్తూ టైం పాస్ చేస్తుంటారు. అయితే, ఇంతకాలం స్మార్ట్ ఫోన్‍లకే పరిమితమైన యూట్యూబ్ షార్ట్స్ టీవీల్లోనూ వచ్చేస్తున్నాయి. ఈ ఫీచర్ ని రోల్ అవుట్ చేస్తూ గూగుల్ కొత్త అప్ డేట్ తీసుకొచ్చింది. 

యూట్యూబ్ ఈ ఫీచర్ ని తీసుకొస్తున్నట్లు ఇదివరకే ప్రకటించినా, పూర్తి స్థాయిలో అప్ డేట్ చేయడానికి ఇంతకాలం పట్టింది. షార్ట్స్ మామూలుగా వర్టికల్ మోడ్ (నిలువుగా) కనిపిస్తాయి. అయితే, వీటిని టీవీల్లో చూసేటప్పుడు బాగా కనిపించదు. దాన్ని మార్చుతూ టీవీల్లో ల్యాండ్ స్కేప్ మోడ్ ని తీసుకొచ్చింది. అంటే టీవీల్లో యూట్యూబ్ షార్ట్స్ ని అడ్డంగా చూడొచ్చు. 2019నుంచి విడుదలైన ఆండ్రాయిడ్, గూగుల్ టీవీల్లో ఈ ఫీచర్ పనిచేస్తుందని యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ నీల్ మోహన్ తెలిపాడు.