బషీర్‌బాగ్, వెలుగు: పిల్లలపై లైంగిక దాడి కంటెంట్ కేసులో యూట్యూబర్‌ను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఏపీకి చెందిన కంబేటి సత్యమూర్తి.. ‘వైరల్ హబ్ 007’ ద్వారా మైనర్లతో అశ్లీల ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. 15 నుంచి 17 ఏండ్ల బాలబాలికలను అసభ్య ప్రశ్నలు అడుగుతూ అనుచిత ప్రవర్తనకు పాల్పడుతున్నాడు. వ్యూస్ పెంచుకోవడానికి ఇలాంటి ఇంటర్వ్యూలు చేస్తున్నట్లు విచార ణలో తేలింది. 2018 నుంచి యూ ట్యూబర్‌గా పనిచేస్తున్న నిందితు డు.. మొదట్లో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లతో అసభ్యకరమైన భాషలో ఇంటర్వ్యూ చేసేవాడు.
ఒక ఇంటర్వ్యూలో బాలుడిని ముద్దు పెట్టుకునేలా బాలికను ప్రేరే పించాడు. ఈ ఘటనను సైబర్ క్రైం పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశారు. డిజిటల్ ఎవిడెన్స్ తో నిందితుడిని అదుపు లోకి తీసుకొని పోక్సో, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. పిల్లల దుర్వినియోగ కంటెంట్‌పై కఠిన చర్యలు తప్పవని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు.
