రైళ్లలో అడ్డగోలు దోపిడీ.. వీడియో తీసిన యూట్యూబర్ను చితక్కొట్టారు.. వీడియో వైరల్

రైళ్లలో అడ్డగోలు దోపిడీ.. వీడియో తీసిన యూట్యూబర్ను చితక్కొట్టారు.. వీడియో వైరల్

ట్రైన్ జర్నీలో మీరెప్పుడైనా MRP ధరలకే వాటర్ బాటిల్ కొన్నారా..? కాఫీ, లంచ్.. మరేదైనా. రైల్వే శాఖ ఇచ్చే రూల్స్, రెగ్యులేషన్స్, ఎమ్మార్పీ ధరలు ఇవేవీ పాటించకుండా అడ్డగోలుగా దోపిడీ చేస్తుంటారు క్యాటరింగ్ బాయ్స్, ఇతర అమ్మకందారులు. ఇదేంటని ప్రశ్నిస్తే.. ఇష్టముంటే తీసుకోండి లేదంటే లేదు.. అని సింపుల్ గా చెప్పేస్తుంటారు. ఆప్షన్ లేక ఎక్కువ డబ్బులు కొనలేని పరిస్థితి. ఇలాంటి ఇన్సిడెంటే ఒకటి హేమకుంత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో జరిగింది. ప్రశ్నించిన యూట్యూబర్ ను చితకబాదారు క్యాటరింగ్ బాయ్స్. 

వివరాల్లోకి వెళ్తే.. విశాల్ శర్మ అనే యూట్యూబ్ వ్లాగర్ జమ్మూ కశ్మీర్ కథువాలోని వైష్ణోదేవి ఆలయ దర్శనం కోసం హేమ్ కుంత్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్నాడు. 3వ ఏసీ కోచ్ లో విశాల్ శర్మపై బట్టలు చినిగిపోయేలా దాడి చేశారు క్యాటరింగ్ బాయ్స్. దీనికి కారణం.. ఎమ్మార్పీ రేట్ల కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారని ప్రశ్నించడమే.

15 రూపాయల వాటర్ బాటిల్ పై 5 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు. 10 రూపాయల కాఫీని 20 రూపాయలకు అమ్ముతున్నా్రు. రైళ్లలో ఐఆర్సీటీసీ తయారు చేసే ‘రైల్ నీర్’ వాటకు బదులు లోకల్ బ్రాండ్ ‘వండర్ ఆక్వా’ అమ్ముతున్నారు. అయినా సరే ఐదు రూపాయలు అదనంగా ఇచ్చి బాటిల్ తీసుకున్నాడు. అయితే ‘‘రైల్ నీర్ అమ్మాలి కదా’’ అని ప్రశ్నిస్తే.. ‘‘ఇవే దొరుకుతాయ్ సార్’’ అని జవాబు చెప్పారట.

►ALSO READ | చీనాబ్ ప్రాజెక్టుల గేట్లు ఖుల్లా .. పాకిస్తాన్కు భారీగా వరద నీరు.. ఆ ప్రాంతాకు ముంపు తప్పదు

ఆ తర్వాత పది రూపాయల కాఫీ 20 ఇచ్చి కొనాల్సి వచ్చింది. నూడిల్స్ రైల్వే ధర 40 ఉంటే.. 50 రూపాయలకు అమ్ముతున్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తే ఇష్టముంటే తీసుకోండి లేదంటే లేదు సార్.. అని ర్యాష్ గా రిప్లై ఇచ్చారట. ఇవన్నీ అడిగినన్ని డబ్బులు ఇచ్చి కొన్నాడు. ఇదంగా వీడియో క్యాప్చర్ చేశాడు శర్మ. 

క్యాటరర్స్ చేస్తున్న దోపిడీనికి వీడియో తీసిన విశాల్ శర్మ.. RailMadad యాప్ లో కంప్లైంట్ రైజ్ చేశాడు. జర్నీలో ప్రతి దానికి అధికంగా చార్జ్ చేస్తున్నారని కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఇది తెలుసుకున్న క్యాటరింగ్ గ్రూప్.. థర్డ్ ఏసీ కోచ్ లో ఉన్న శర్మ దగ్గరకు వచ్చి దారుణంగా దాడి చేశారు.  బట్టలు ఊడిపేయే దాకా కొట్టారు. వాళ్ల దాడిని కూడా వీడియో తీశాడు విశాల్. ‘‘నీచే ఆవో.. నీచే ఆవో’’ అంటూ కిందికి లాగి మరీ అటాక్ చేయడం వీడియోలో చూడవచ్చు. తానేం తప్పు చేయలేదని.. కేవలం కంప్లైట్ రైజ్ చేశానని చెప్పినా వినకుండా బెదిరించారు. బెర్త్ పైకి ఎక్కి కాలు పట్టి లాగి దాడి చేశారు. ఈ వీడియోను ఎక్స్, యూట్యూబ్ ప్లాట్ ఫాంలలో పోస్ట్ చేశాడు. 

క్యాటరర్స్ కు రూ.5లక్షల జరిమానా:

సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. రైల్వే శాఖ స్పందించింది. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి.. క్యాటరర్స్ పైన 5 లక్షల రూపాయల జరిమాన విధించినట్లు రైల్వే సేవా ప్రకటించింది. ఈ ఘటనపై రైల్వే శాఖ తీవ్ర ఆగ్రహంతో ఉందని, కఠిన చర్యలు తప్పవని పేర్కొంది. అధిక ధరలు వసూలు చేయడంపై కఠిన చర్యలు తీసుకుంటామని IRCTC ప్రకటించింది.