వివేకా కేసు.. వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి ఎస్కార్ట్‌ బెయిల్‌

వివేకా కేసు.. వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి ఎస్కార్ట్‌ బెయిల్‌

వివేకాహత్య కేసులో భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. 12 రోజుల పాటు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 3 వరకు బెయిల్ కు సీబీఐ కోర్టు ఎస్కార్ట్ బెయిల్ కు అనుమతించింది. అనారోగ్యం కారణంగా భాస్కర్ రెడ్డి బెయిల్ కోరగా, కోర్టు అందుకు అనుమతించింది.

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్‌ భాస్కర్ రెడ్డికి బెయిల్‌ లభించింది. అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్‌ ఇవ్వాలని ఆయన సీబీఐ కోర్టును ఆశ్రయించారు.  ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు.. సెప్టెంబర్‌ 22వ తేదీ నుంచి అక్టోబర్‌ 3వ తేదీ వరకు 12 రోజులపాటు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేస్తూ బుధవారం (సెప్టెంబర్ 20) ఆదేశాలు ఇచ్చింది. ఎస్కార్ట్‌ బెయిల్‌లో భాగంగా ముగ్గురు పోలీసులు, ఒక పోలీస్‌ వెహికిల్‌ ఉంటాయి. ఎస్కార్ట్‌ బెయిల్‌లో వీళ్లు భాస్కర్‌ రెడ్డి వెంటే ఉంటారు.అంతేకాదు ఎస్కార్ట్‌కు అయ్యే ఖర్చులు భరించాలని భాస్కర్ రెడ్డిని ఆదేశించింది. . బెయిల్ ముగిసిన తర్వాత ఆయన మళ్లీ కోర్టులో లొంగిపోనున్నారు.