
పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక ఏపీలో రాజేసిన రాజకీయ వేడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంగళవారం ( ఆగస్టు 12 ) జరిగిన ఈ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపించే రేంజ్ లో ఉద్రిక్తతకు దారి తీశాయి. ఈ క్రమంలో పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికపై మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు తన పాలనపై నమ్మకం ఉంటే ఎన్నికను రద్దు చేయాలని సవాల్ విసిరారు.
ఏపీలో ప్రజాస్వామ్యం కనపడటం లేదని.. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూడటానికి పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలు ఉదాహరణ అని అన్నారు జగన్. పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ ఏజెంట్లు లేకుండా జరగడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి అని అన్నారు. వైసీపీ ఏజెంట్లు పోలింగ్ బూతుల్లోకి పోకుండా ఎన్నిక రిగ్గింగ్ చేశారని అన్నారు జగన్. ఇలాంటి ఎన్నికలు బహుశా దేశంలో ఎక్కడా జరిగి ఉండవేమోనని అన్నారు.
పోలింగ్ బూతులో కూర్చునే హక్కు, ఓటర్లను గుర్తించే హక్కు ఏజెంట్లు కి ఉంటుందని... తమ ఏజెంట్ల నుంచి ఫామ్ 12ను పోలీసులు, టీడీపీ నేతలు లాక్కున్నారని అన్నారు. ప్రజా స్వామ్యం ఇంతలా దిగజారడం దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదని అన్నారు. పోలింగ్ ముగిసిన తరువాత ఫామ్ 32 నింపి ఆ బూతు లో ఎన్ని ఓట్లు వచ్చాయో అధికారి ఏజెంట్ కి ఇవ్వాల్సి ఉంటుందని... కానీ, ఏ పోలింగ్ బూత్ లో కూడా అలా జరగలేదని అన్నారు.
►ALSO READ | తిరుమల ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనులపై సమీక్ష.. అదనపు ఈవో వెంకయ్య చౌదరి కీలక ఆదేశాలు..
పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అరాచకాలపై ప్రజాస్వామ్య వాదులు అందరూ గొంతు విప్పాలని.. లేదంటే ప్రజా స్వామ్యం అపహాస్యం అవుతుందని అన్నారు. దోచుకో,పంచుకో, తినుకో అన్నదే టీడీపీ అజెండా అని.. బంధిపోటు దొంగల్లా నిన్న ఓట్లు వేయించుకున్నారని మండిపడ్డారు జగన్. పోలీసులు కూడా అందుకు సహకరించారని అన్నారు.ప్రతి పోలింగ్ బూతుకి సంబంధించిన వెబ్ కాస్టింగ్, సీసీటివి ఫుటేజ్ ఇచ్చే దైర్యం ప్రభుత్వానికి లేదని అన్నారు.కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజా స్వామ్య బద్దంగా ఎన్నికలు జరిపించాలని కోరారు జగన్..