తిరుమల ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనులపై సమీక్ష.. అదనపు ఈవో వెంకయ్య చౌదరి కీలక ఆదేశాలు..

తిరుమల ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనులపై  సమీక్ష..  అదనపు ఈవో వెంకయ్య చౌదరి కీలక ఆదేశాలు..

కలియుగ వైకుంఠం తిరుమలలోని ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. మంగళవారం ( ఆగస్టు 12 ) సాయంత్రం జరిగిన ఈ సమీక్షలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు వెంకయ్య చౌదరి. సివిల్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ పనులు, మ్యూజియం గైడ్స్, భద్రత, పారిశుద్ధ్యం ఇతర సౌకర్యాలకు సంబంధించి ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ఆదేశించారు.

ఎస్వీ మ్యూజియంను ప్రపంచస్థాయి ఆధునిక మ్యూజియంగా అభివృద్ధి చేయాలని సూచించారు వెంకయ్య చౌదరి. పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. ఈ సమావేశంలో ఇన్ ఛార్జ్  చీఫ్ మ్యూజియం ఆఫీసర్ శ్రీ సోమన్నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.