డిజిటల్ బుక్ లాంచ్ చేసిన జగన్.. కార్యకర్తలకు అండగా..

డిజిటల్ బుక్ లాంచ్ చేసిన జగన్.. కార్యకర్తలకు అండగా..

కార్యకర్తల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు వైసీపీ అధినేత జగన్. కూటమి పాలనలో అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండగా నిలబడటం కోసం డిజిటల్ బుక్ లాంచ్ చేశారు జగన్.  బుధవారం ( సెప్టెంబర్ 24 ) తాడేపల్లిలో పార్టీ ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ డిజిటల్ బుక్ లాంచ్ చేశారు జగన్. ఎలాంటి అన్యాయం జరిగినా డిజిటల్ బుక్ పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు జగన్. ఇందుకోసం Digitalbook.weysrcp.com పేరుతో పోర్టల్ ను లాంచ్ చేశారు జగన్.

కూటమి పాలనలో అన్యాయానికి గురైన రాజకీయ బాధితులు, కార్యకర్తలు, నాయకులకు అండగా నిలిచేందుకు ఈ ప్రత్యేక పోర్టల్ లాంచ్ చేసినట్లు తెలిపారు జగన్. ఈ పోర్టల్ ఆన్ లైన్లో అందుబాటులో ఉంటుందని.. దీని ద్వారా ఎవరైనా తాము ఎదుర్కొన్న అన్యాయం గురించి వివరాలు అప్ లోడ్ చేయచ్చని అన్నారు జగన్. ప్రతి ఘటనను పెర్మనెంట్ డిజిటల్ డైరీలో ఎంటర్ చేసి భద్రపరుస్తామని.. తాము అధికారంలోకి వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు జగన్.

డిజిటల్ బుక్ వెబ్‌ సైటుతో పాటు 040-49171718 ద్వారా ఐవీఆర్ఎస్ కాల్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు జగన్. దీని ద్వారా బాధితులు ఫోన్లో తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని అన్నారు. పోర్టల్ లో ఫిర్యాదు చేయడం ఇబ్బందిగా ఫీల్ అయినవాళ్ల కోసం క్యూఆర్ కోడ్ రూపొందించామని తెలిపారు జగన్.

ALSO READ : రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్...78 రోజుల బోనస్ ప్రకటించిన కేంద్రం

కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలను, కార్యకర్తలను ఇబ్బంది పెడుతోందని.. తమ ప్రభుత్వం వచ్చాక వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని అన్నారు జగన్. బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని.. సప్త సముద్రాల అవతల ఉన్నా, రిటైర్‌ అయినా వదిలిపెట్టమని అన్నారు జగన్. ఈరోజు వారు రెడ్‌బుక్‌ అంటున్నారని.. రాబోయే రోజుల్లో డిజిటల్ బుక్ అంటే ఏమిటో చూపిస్తామని అన్నారు జగన్.