
- రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన వైఎస్ జగన్
- సీబీఐ దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి
- ఇంటలిజెన్స్ టీడీపీ వాచ్ మెన్ లా తయారైందని విమర్శ
హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై… చంద్రబాబుకు రిపోర్ట్ చెయ్యని వ్యవస్థతో దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కోరారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. డీజీపీ, ఇంటలిజెన్స్ అధికారుల సమక్షంలో జరిగే దర్యాప్తు పక్కదారి పడుతోందని అన్నారు. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని గవర్నర్ నరసింహన్ ను రిక్వెస్ట్ చేశారు. ఒకట్రెండురోజుల్లో సీబీఐ దర్యాప్తుకు ఆదేశాలు రాకపోతే.. కోర్టుకు కూడా వెళ్తామన్నారు.
ఏపీలో ప్రస్తుతం ఉన్న డీజీపీ, ఇంటలిజెన్స్ అధికారులను వెంటనే మార్చాలన్నారు జగన్. వారి ఆధ్వర్యలో నిర్వహించే ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరగవన్నారు. వీరిని ఎలక్షన్ బాధ్యత నుంచి తప్పించాలని కోరారు. ఎన్నికలకు 40 రోజుల ముందు ఎస్పీ స్థాయి అధికారులను మార్చి కుట్రలకు తెరతీశారని ఆరోపించారు.
టీడీపీ తాము ఎన్నికల్లో గెలవడం కోసం ఓట్లను తొలగించడమే కాదు.. మనుషులను కూడా లేకుండా చేస్తోందని అన్నారు వైఎస్ జగన్. చిన్నాన్నకు సెక్యూరిటీ ఎప్పుడూ ఇవ్వలేదని అన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గ ఇంచార్జ్ గా వైఎస్ వివేకాను తాము నియమించడమే తప్పా.. ఆయన ప్రచారం చేయడమే తప్పా.. అని ప్రశ్నించారు. నిజంగా చంద్రబాబులో న్యాయం ఉంటే.. చిన్నాన్న చావులో ఆయన పాత్ర లేకపోతే సీబీఐ విచారణకు ఎందుకివ్వరు అని అడిగారు జగన్.
.