నాలో చాలా మార్పు వచ్చింది.. కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యం: వైయస్ జగన్

నాలో చాలా మార్పు వచ్చింది.. కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యం: వైయస్ జగన్

అమరావతి: కూటమి ప్రభుత్వంపై రాష్ట్రంలో తీవ్ర అసంతృప్తి ఉందని.. అరాచక పాలన పట్ల వివిధ రూపాల్లో ప్రజలు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారని  ఏపీ మాజీ సీఎం  వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు పరిపాలనపట్ల తీవ్రమైన ఆగ్రహం ఉందని, రాజకీయాలతో సంబంధం లేనివారిని కూడా కక్షలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు చూసి తనలో చాలా మార్పు వచ్చిందని.. పార్టీలో
కార్యకర్తలకు కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. 

ఈసారి కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని, పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరినీ గొప్ప స్థానంలో కూర్చోబెడతానని హామీ ఇచ్చారు వైయస్ జగన్. తాను చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేనని, ప్రజలకు హామీలు ఇస్తే కచ్చితంగా నెరవేరుస్తానని చెప్పారు. కార్యకర్తల్లో ఇప్పటికే మంచి చైతన్యం వచ్చిందన్న జగన్.. కేడర్‌ ధైర్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. 

►ALSO READ | దేశభద్రతపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసు పెట్టాల్సిందే: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

రాష్ట్రవ్యాప్తంగా తాను ఎక్కడికి వెళ్లినా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివస్తున్నారని.. ప్రభుత్వంపై అసంతృప్తిని తెలియజేస్తున్నారని అన్నారు.  వచ్చే ఏడాది ప్లీనరీని నిర్వహిద్దామని, కష్టపడే కార్యకర్తలకు సముచిత స్థానం ఇస్తామని చెప్పారు జగన్.