
హైదరాబాద్, వెలుగు: ‘కేసీఆర్ అంటే కాలు వలు, చెరువులు, రిజర్వాయర్లు కాదు చిన్న దొర.. కే అంటే కన్నీళ్లు, సీ అంటే చావులు, ఆర్ అంటే రోదనలు’ అని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ఎద్దేవా చేశారు. ఈ మేరకు శనివారం ఆమె ట్వీట్ చేశారు. రుణమాఫీకి, ఉచిత ఎరువులకు పంగనామం పెట్టారని, సబ్సిడీ విత్తనాలిస్తామని రైతులకు కుచ్చుటోపీ పెట్టా రని ఫైరయ్యారు. గాలి మోటార్లో తిరిగి గాలి మాటలు చెప్పి నష్టపరిహారం ఎగ్గొట్టార ని, అప్పులపాలై రైతులు ఉరేసుకుంటున్నా, కల్లాలపైనే గుండెలు ఆగిపోతున్నా సీఎంకు పట్టడం లేదన్నారు. ఆయనకు పంజాబ్, హర్యానా రైతులే కనిపిస్తరని, ఇక్కడి రైతుల కష్టాలు పట్టవన్నారు. భూస్వాములకు లక్షలకు లక్షలు రైతుబంధు ఇస్తూ.. కౌలు రైతులను కాటికి పంపుతున్న రాక్షస ప్రభుత్వమని ఆరోపించారు.60 ఏండ్ల వరకే రైతు బీమాను పరిమితం చేయడం ఏంటని ప్రశ్నించారు.