
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇటీవల సోషల్ మీడియాలో హాట్ హాట్ గా డిస్కషన్ జరిగిన సంగతి తెలిసిందే. రాజారెడ్డి అవసరమైనప్పుడు తప్పకుండా పాలిటిక్స్ లోకి వస్తాడంటూ షర్మిల చేసిన కామెంట్స్ మరింత హీట్ ని పెంచాయి. షర్మిల కామెంట్స్ పై వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు. ఈ క్రమంలో వైసీపీని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు షర్మిల. నా కొడుకు ఇంకా రాజకీయాల్లో అడుగే పెట్టకముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతోందంటే.. ఇది భయమా, బెదురా ? వాళ్ళకే తెలియాలి అంటూ కౌంటర్ ఇచ్చారు షర్మిల.
రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయంగా వైఎస్సార్ అని.. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గోల పెట్టినా నా కొడుకు వైఎస్ రాజారెడ్డినే అని అన్నారు. ఎన్ని కుక్కలు మొరిగినా దీన్ని మార్చలేరని ఘాటైన వ్యాఖ్యలు చేశారు షర్మిల. రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి వారసుడి అని అన్నారు. చంద్రబాబు చెప్తే నా కొడుకు వస్తున్నాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు షర్మిల. కష్టపడి మార్ఫింగ్ వీడియో చేశారని.. ఆ వీడియో చూసి.. ఇంత కష్టం ఎందుకొచ్చిందని నవ్వొచ్చిందని అన్నారు షర్మిల.
►ALSO READ | టీటీడీ కొత్త సభ్యుడుగా టీవీఎస్ మోటార్స్ CMD సుదర్శన్ వేణు
చంద్రబాబు చెప్తే నేను రాజారెడ్డిని తీసుకొస్తే.. మరి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో RSS వాదికి మద్దతు ఇచ్చారో వైసీపీ అధినేత జగన్ సమాధానం చెప్పాలని అన్నారు షర్మిల. నిస్సిగ్గుగా RSS అభ్యర్థికి జగన్ మద్దతు ఇవ్వడం అవమానకరమని అన్నారు. వైఎస్సార్ బ్రతికి ఉంటే జగన్ చేసిన పనికి అవమానంతో సిగ్గుతో తలదించుకునేవారని అన్నారు షర్మిల. సుదర్శన్ రెడ్డికి ఎందుకు మద్దతు ఇవ్వలేదో జగన్ సమాధానం చెప్పాలని అన్నారు.
సుదర్శన్ రెడ్డి న్యాయ నిపుణులు అని.. రాజ్యాంగం గురించి తెలిసినవారని.. ఇలాంటివారికి జగన్ ఎందుకు మద్దతివ్వలేదని అన్నారు షర్మిల. జగన్ మోడీకి దత్తపుత్రుడని.. మోడీ చెప్పినట్లు ఆడుతున్నాడని అన్నారు. వైఎస్సార్ మరణం వెనక రిలయన్స్ హస్తం ఉందని చెప్పిన జగన్ అదే రిలయన్స్ వాళ్లకు రాజ్యసభ ఇచ్చాడని అన్నారు. మోడీ కోసం అదానీకి గంగవరం పోర్టు కట్టబెట్టారని అన్నారు. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు బీజేపీ అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారని.. ఏ మొహం పెట్టుకొని మద్దతిచ్చారో జగన్ సమాధానం చెప్పాలని అన్నారు షర్మిల.