10  రోజుల్లో పరిహారం ఇస్తామన్న దొర రూపాయివ్వలే : షర్మిల

10  రోజుల్లో పరిహారం ఇస్తామన్న దొర రూపాయివ్వలే : షర్మిల

సీఎం కేసీఆర్ పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు  షర్మిల. రైతులను మోసగిస్తున్న సీఎం కేసీఆర్ 420 అని వ్యాఖ్యానించారు.  అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి ఎకరాకు 10  రోజుల్లో పరిహారం ఇస్తామని కమ్మటి మాటలు పలికిన దొర  ఇప్పటివరకు రూపాయి  ఇవ్వలేదన్నారు. కేసీఆర్ బుద్ధి తేనెపూసిన కత్తి అని మరోసారి తేలిపోయిందన్నారు.  

మొదట 2.28లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని..లెక్కలుగట్టి, చివరకు 1.51లక్షల ఎకరాల్లో మాత్రమేనని తేల్చి, రైతుల నోట్లో మట్టి కొట్టిండని విమర్శించారు షర్మిల. అన్నదాతలను ఆదుకుందామన్న సోయి లేదు కానీ తమది కిసాన్ సర్కారని పక్క రాష్ట్రాల్లో దొంగ ప్రచారం చేసుకోవడం మాత్రం చేతనైందన్నారు షర్మిల. ఏడాది కింద నష్టపోయిన రైతులకు సైతం పరిహారం ఎగ్గొట్టి ఇప్పుడు కూడా పైసా ఇవ్వకుండా నాన్చుతుండని విమర్శించారు.

సీఎం కేసీఆర్  రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పి నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.10వేలు కాకుండా వరి పంటకు రూ.25వేలు, మిర్చి, మొక్కజొన్న పంటకు రూ.50వేలు, మామిడికి రూ.75 వేలు ఇవ్వాలని డిమాండ్  చేశారు.