కేసీఆర్ బిడ్డకున్న రక్షణ తెలంగాణ ఆడబిడ్డలకు లేదా ? : షర్మిల

కేసీఆర్ బిడ్డకున్న రక్షణ తెలంగాణ ఆడబిడ్డలకు లేదా ? : షర్మిల

సీఎం కేసీఆర్ పాలనలో ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణే లేకుండా పోయిందనిఆరోపించారు వైఎస్ ఆర్టీపీ చీఫ్ షర్మిల. రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ ఆంశంపై ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ పై ఆమె ఆగ్రహం  వ్యక్తం చేశారు. బతుకుమ్మ ఆడే పవిత్ర గడ్డపై మహిళలు మాయమవుతుంటే కేసీఆర్ మొద్దు నిద్ర పోతున్నాడని విమర్శించారు. 

గత రెండెళ్లలో 34 వేల 495 మంది మహిళలు, 8 వేల 66 మంది అమాయక బాలికలు కనిపించకుండా పోయారంటే  కేసీఆర్ తలదించుకోవాలన్నారు షర్మిల.  కేసీఆర్ బిడ్డకున్న రక్షణ.. తెలంగాణ ఆడబిడ్డలకు లేదా అని ప్రశ్నించారు. దేశంలోనే  నంబర్ వన్ అని చెప్పే పోలీసింగ్ వ్యవస్థ... మహిళలు మాయమవుతుంటే ఏం చేస్తుందని ప్రశ్నించారు.  

ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడం మీదున్న శ్రద్ధలో ఒక్క కూడా ఆడబిడ్డల రక్షణ మీద లేదని షర్మిల విమర్శించారు.   సీఎం కేసీఆర్ కు మహిళలపై ఏ మాత్రం గౌరవం ఉన్న వెంటనే మిస్సింగ్ కేసులపై దర్యాప్తు కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.  వెంటనే తప్పిపోయిన మహిళలు, బాలికల ఆచూకీ కనిపెట్టాలన్నారు షర్మిల.