కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు

కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు

అవినీతి చేస్తున్నారని తెలిసికూడా కేసీఆర్ ని ఎందుకు అరెస్ట్ చెయ్యడంలేదని అమిత్ షా పై ఫైర్ అయ్యారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.రాష్ట్ర ప్రభుత్వ ప్రతి పథకంలో కేంద్రం వాటా ఉందని అమిత్ షా అంటున్నారని..అయితే కేసీఆర్ అవినీతిలో వాటా లేదంటే నమ్మాలా అని నిలదీశారు. రైతులను కార్లతో గుద్దిచంపి..రైతాంగాన్ని ఆదుకుంటామని చెవిలో పూలు పెడుతున్నారంటూ మండిపడ్డారు. చట్టబద్ధంగా ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చలేదన్న షర్మిల ఏ మొహం పెట్టుకొని ఒక్క చాన్స్ ఆడుగుతున్నారని విమర్శించారు. మైనార్టీలను బలిపశువులను చేసి అధికారపీఠాలను ఎక్కుతున్న మీరు వాళ్లకున్న 4% రిజర్వేషన్ తీసెయ్యడం కాకుండా ఇంకేం ఆలోచించగలరని ప్రశ్నించారు. వైఎస్సార్ ఇచ్చిన రిజర్వేషన్ ను మోడి, షా కలిసొచ్చినా ఏం చెయ్యలేన్న షర్మిల బీజేపీ మతోన్మాదాన్ని వైఎస్సార్ స్పూర్తి మాత్రమే  ఎదుర్కోగలదన్నారు.

మరిన్ని వార్తల కోసం

కూతురు కోసం 30 ఏళ్లుగా పురుషుడి అవతారంలో

అధికారంలోకి వస్తే ఉచితంగా విద్య, వైద్యం

ధర తక్కువ.. ఉపయోగం ఎక్కువ