కరీంనగర్‌తో వైఎస్‌కు విడదీయరాని బంధం

V6 Velugu Posted on Mar 18, 2021

కరీంనగర్‌తో వైఎస్‌కు విడదీయరాని బంధం ఉందన్నారు వైఎస్ షర్మిల. గురువారం కరీంనగర్ జిల్లా వైఎస్‌ అభిమానులతో వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరీంనగర్ కమాన్‌ దగ్గర నిలబడితే యావత్ తెలంగాణ నాడి తెలుస్తోందన్నారు. సిటీ ఆఫ్ ఎనర్జీ రామగుండం, సింగరేణి మనకు తలమానికం..అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన నేతన్నలు కనిపిస్తారని చెప్పారు. కరీంనగర్ రైతుల కష్టాలు చూసే ఉచిత విద్యుత్‌ ఇచ్చారని ఆమె గుర్తుచేశారు. కరీంనగర్ జిల్లా రైస్‌బౌల్ అనడానికి వైఎస్సే కారణమని చెప్పారు. ఎల్లంపల్లి, మిడ్ మానేరు కట్టించిన ఘనత వైఎస్‌దన్నారు. శాతవాహన యూనివర్సిటీ రాజశేఖర్‌రెడ్డి ఇచ్చారని గుర్తుచేశారు. రాజన్న సంక్షేమ పాలన మళ్లీ తీసుకొస్తానన్నారు వైఎస్ షర్మిల.

Tagged Karimnagar

Latest Videos

Subscribe Now

More News