
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కొడుకు వివాహానికి హాజరు కావాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆహ్వానించారు. జనవరి 17వ తేదీ బుధవారం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన షర్మిల...పవన్ కలిసి తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థం, పెళ్లికి హాజరవ్వాల్సిందిగా కోరుతూ వివాహ పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా పలు విషయాలపై షర్మిల, పవన్ కొద్దిసేపు చర్చించినట్లు తెలుస్తోంది.
ఈనెల 18న అట్లూరి ప్రియ-రాజా రెడ్డిల నిశ్చితార్థం జరగనుంది. ఫిబ్రవరి 17న వీరి వివాహం జరగనుంది. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులను కలుస్తూ తన కొడుకు నిశ్చితార్థం, వివాహానికి ఆహ్వానిస్తున్నారు వైఎస్ షర్మిల. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి, సోదరుడు వైస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీ తదితరులను తన తనయుడి పెళ్లికి ఆహ్వానించారు