ఉద్యోగాలు భర్తీ చేయలేని ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి

ఉద్యోగాలు భర్తీ చేయలేని ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి

విద్యార్థుల ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ రాష్ట్రాన్ని నిరుద్యోగం పట్టిపీడిస్తోందన్నారు వైఎస్ షర్మిల. ఉద్యోగాలు భర్తీ చేయలేని ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేశారు షర్మిల. మాట తప్పితే రాళ్లతో కొట్టి చంపమన్న కేసీఆర్ ను ఇప్పుడు ఏం చేయాలో చెప్పాలని ప్రశ్నించారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. నిరుద్యోగ దీక్షలో భాగంగా రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ లో షర్మిల దీక్ష చేశారు. అమెరికా నుంచి ఊడిపడ్డ కేసీఆర్ బిడ్డలకు ఉద్యోగాలు.. తెలంగాణ కోసం కొట్లాడిన విద్యార్థులకు  ఆత్మహత్యలా అంటూ నిలదీశారు. ఉద్యోగాలు భర్తీ చేయలేని సీఎం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న లక్షా 91వేల ఉద్యోగాలనుభర్తీ చేయకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తామన్నారు.

 YSR పాలనలో నిరుద్యోగులు, విద్యార్థులు క్షేమంగా ఉన్నారని చెప్పారు షర్మిల. ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేటు రంగంలోనూ 11 లక్షల ఉద్యోగాలు సృష్టించారన్నారు. BC, SC, ST  కార్పొరేషన్లతో పేదలకు లోన్లు ఇచ్చి, స్వయం ఉపాధి కల్పించారని తెలిపారు. ఆరోగ్యశ్రీతో కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించారని అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ తో ఎంతో మందికి ఉచిత విద్య అందించారని తెలిపారు.ప్రజా ప్రస్థాన పాదయాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం ఆగర్మియగూడ గ్రామ శివారు నుంచి ఏడో రోజు పాదయాత్ర చేశారు షర్మిల.  బుధవారం తిమ్మాపూర్ నుంచి 8 వ రోజు పాదయాత్ర మొదలై.. ఇబ్రహీంపట్నం ఎలిమినేడులో ముగియనుంది.