కూలీలతో కలిసి పాటపాడుతూ షర్మిల వరి నాట్లు

కూలీలతో కలిసి పాటపాడుతూ షర్మిల వరి నాట్లు

వికారాబాద్ కొడంగల్ నియోజకవర్గం నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. హకీంపేట, పోలేపల్లి, సర్జకాన్ పేట కోస్గీ టౌన్, ముశ్రిఫా గ్రామాల మీదుగా పాదయాత్ర సాగనుంది. పాదయాత్రలో స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. హకీంపేట గ్రామ పరిధిలో పొలంలో రైతు కూలీలతో కలిసి వైఎస్ షర్మిల వరి నాట్లు వేశారు . సాయంత్రం 4 గంటలకు కొస్గీ గ్రామ ప్రజలతో మాట ముచ్చట కార్యక్రమం నిర్వహించనున్నారు షర్మిల. 

 

పాదయాత్రలో సీఎం కేసీఆర్ పాలనపై షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ వస్తే బతుకులు బాగు పడుతాయనుకుంటే.. బతుకే లేకుండా చేసి, ప్రతి ఒక్కరిపై రెండు లక్షల అప్పు పెట్టిండని మండిపడ్డారు. ప్రజల తరఫున ప్రశ్నిస్తారని ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. భూకబ్జాలు,సెటిల్ మెంట్లతో దందాలకు తెరలేపి, అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్  సంక్షేమ పాలనతోనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.