రైతుల హక్కు కోసం నేను పోరాడతా

రైతుల హక్కు కోసం నేను పోరాడతా

వరి వేయొద్దని ఆంక్షలు పెట్టడానికే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారా అని ప్రశ్నించారు YSRTP అధ్యక్షురాలు షర్మిల. వరి వేయకుండా రైతులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో రైతుకు స్వాతంత్ర్యం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో భాగంగా నల్గొండ జిల్లా వెలిమినేడులో నిర్వహించిన మాటా ముచ్చట కార్యక్రమంలో స్థానికులతో షర్మిల పాల్గోని మాట్లాడారు. వ్యవసాయం కూడా కేసీఆర్ చేతిలో బందీ అయిపోయిందన్నారు. రైతుల హక్కు కోసం తాను పోరాడతానన్నారు షర్మిల. 

సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలిబన్లు ఆఫ్ఘన్ ను ఆక్రమించినట్లు ..కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను ఆక్రమించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తెలంగాణ ప్రజల కోసమే పార్టీ పెట్టానని.. మీకోసం నిలబడుతా, కొట్లాడుతానని తెలిపారు. రాష్ట్రంలో సమస్యలు లేవని ప్రభుత్వం చెబుతోంది.. అర్హులైన వారికీ పింఛన్లు రావడం లేదు.. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అన్నారు ఎవరికైన ఇచ్చారా..కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు..దళితులకు మూడెకరాల భూమి, ముస్లింలకు రిజర్వేషన్లు, ఇంటికో ఉద్యోగం అన్నారు ..ఇవన్నీ సమస్యలు కావా అని ప్రశ్నించారు షర్మిల. కేసీఆర్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరన్నారు .