రాహుల్ ను ప్రధాని చేయడం మా నాన్న కల : షర్మిల

రాహుల్ ను  ప్రధాని చేయడం మా నాన్న కల : షర్మిల

కాంగ్రెస్ లో చేరడం సంతోషంగా ఉందన్నారు షర్మిల. ఢిల్లీలో రాహుల్ గాంధీ ,ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. రాహుల్, మల్లికార్జున ఖర్గే షర్మిలకు కండువా కప్పి పార్టీలోకి  ఆహ్వానించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆమె..  రాహుల్ గాంధీని ప్రధాని చేయడం వైఎస్సార్ కల అని.. అది నిజం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.  కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి ఎంతో పనిచేశారన్నారు. కాంగ్రెస్ ఏ బాధ్యత అప్పగించినా  తన  శక్తి మేరకు పనిచేస్తానని చెప్పారు షర్మిల.

దేశంలో కాంగ్రెస్  అతిపెద్ద సెక్యూలర్ పార్టీ అని అన్నారు వైఎస్ షర్మిల.  కాంగ్రెస్  అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు.  దేశంలో అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్ దేనని చెప్పారు.   రాహుల్ జోడయాత్రతోనే కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతో కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించి పోటీ చేయలేదన్నారు. మణిపూర్ లో క్రైస్తవులపై దాడి చేయడం తనను బాధించిందన్నారు.   కాంగ్రెస్ అధికారంలో లేకుంటే అన్ని రాష్ట్రాల్లో  మణిపూర్ పరిస్థితే వస్తుందని చెప్పారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం షర్మిల దంపతులు సోనియా గాంధీని   కలిసారు.