కర్ణాటక నుంచి రాజ్యసభకు ఏపీ పీసీసీ చీఫ్​ వైఎస్ షర్మిల

కర్ణాటక నుంచి రాజ్యసభకు ఏపీ పీసీసీ చీఫ్​ వైఎస్ షర్మిల

ఏపీ పీసీసీ చీఫ్ఎస్ షర్మిల తొందరలోనే రాజ్యసభ ఎంపీగా నామినేట్ కానున్నారా ? అంటే అవుననే కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కాంగ్రెస్ నుండి రాజ్యసభ ఎంపీగా  ఎంపికవుతారని సమాచారం..


ఏపీ పీసీసీ చీఫ్​ , ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిల కర్నాటక నుంచి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది.  ఆమె  కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపికయ్యే అవకాశం ఉంది. ఏపీ పీసీసీ చీఫ్​   వైయస్ షర్మిల రాజ్యసభలోకి అడుగుపెట్టే అవకాశాలు దగ్గర్లోనే ఉన్నట్లు తెలుస్తోంది .  కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమెను కర్నాటక నుంచి రాజ్యసభకు ఎంపిక చేసే అవకాశం ఉంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన  తర్వాత  ఆమెకు గౌరవప్రదమైన హోదా ఇవ్వాలని ఆలోచనను కాంగ్రెస్ లోని పెద్దలు సన్నాహాలు చేశారు.  ఈ విషయంలో  కర్నాటక  ఉప ముఖ్యమంత్రి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రత్యేక చొరవ చూపిస్తున్నట్లు తెలిసింది.  

రాజ్యసభ ఎంపీగా షర్మిల

షర్మిలకు గౌరవప్రదమైన హోదా ఇచ్చే క్రమంలో కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపాలనే ఆలోచనను డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అలాగే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం కూడా ఉంది.  వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ ఏపీ బాధ్యతలు తీసుకున్న తరవాత ఏపీలో అధికారపార్టీ వైఎస్సార్శీపై  దూకుడు పెంచారు.  ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో షర్మిల ప్రజల్లో చురుగ్గా వెళ్తూ  ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు.   వైయస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా  ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీకి జీవసత్వాలు తెచ్చే స్టామినా షర్మిలకు మాత్రమే  ఉందంటూ  కాంగ్రెస్ నాయకులు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కర్నాటక నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా షర్మిలను నియమించే  ఆలోచనలో  అధిష్ఠానం ఉందని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.  మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.  .