నా ఆరాటం, పోరాటం తెలంగాణ కోసమే : షర్మిల

నా ఆరాటం, పోరాటం తెలంగాణ కోసమే : షర్మిల

తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా, తెలంగాణ కోసం పోరాడుతూనే ఉంటానని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. ఊహాజనిత కథలు కల్పిస్తూ, తనకు, తెలంగాణ ప్రజల మధ్య అగాథాన్ని సృష్టించే విఫల యత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. పనిలేని, పసలేని దార్శనికులకు తాను చెప్పేది ఒకటేనని, తన రాజకీయ భవిత మీద పెట్టే దృష్టిని, సమయాన్ని సీఎం కేసీఅర్ పాలనపై పెట్టండని ఆమె పోస్టు ద్వారా సూచించారు.

అన్నివిధాలుగా సీఎం కేసీఆర్ సర్కారు పాలనలో సర్వనాశనమైపోతున్న తెలంగాణ భవిత మీద దృష్టి పెట్టండని షర్మిల చెప్పారు. సీఎం కేసీఆర్ కుటుంబం అవినీతిని ఎండగట్టండని నిప్పులు చెరిగారు. తన భవిష్యత్తు తెలంగాణతోనే, తెలంగాణలోనే అన్న షర్మిల.. తన ఆరాటం, పోరాటం తెలంగాణ కోసమేనని తేల్చి చెప్పారు.

వైఎస్ షర్మిల తన పార్టీ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి షర్మిల బర్త్ డే విషెస్ కూడా తెలియజేశారు. రాహుల్ గాంధీ పట్టుదల, సహనంతో నిత్యం ప్రజలకు ఇలాగే స్ఫూర్తినిస్తూ, ప్రజలకు సేవ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నానని షర్మిల ట్వీట్ కూడా చేసింది. దీంతో ఈ ప్రచారానికి మరింత ఆజ్యం పోస్తున్నట్టయింది. ఈ వార్తలను షర్మిల ఖండించినప్పటికీ.. కొందరు నేతలు మాత్రం దీనిపై ఇంకా సాగదీస్తూ పలు వ్యాఖ్యలు చేస్తున్నారు.

ALSOREAD:ఫాంహౌస్ కు రోడ్డేస్కోని పేదల ఇండ్లు ముంచిండు : రేవంత్ రెడ్డి 

https://twitter.com/realyssharmila/status/1672193166160830464