
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జి.సాయన్న కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పరామర్శించారు. కార్ఖానాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లిన వైఎస్ షర్మిల.. సాయన్న కుటుంబ సభ్యులను ఓదార్చారు. సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే సాయన్న అకాల మరణం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. సాయన్న లాంటి ఎమ్మెల్యే చాలా అరుదుగా ఉంటారని, ఆయన ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా ఎమ్మెల్యేగా నియోజకవర్గం ప్రజలకు సేవలు అందించారని గుర్తు చేశారు.