షర్మిల పాదయాత్ర వద్ద వైఎస్ విజయమ్మ బర్త్ డే

షర్మిల పాదయాత్ర వద్ద వైఎస్ విజయమ్మ బర్త్ డే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర క్యాంపు వద్ద వైఎస్ విజయమ్మ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. లక్ష్మీదేవిపల్లి వద్ద కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో  వై.ఎస్.విజయమ్మ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు షర్మిల. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా విజయమ్మకు శుభాకాంక్షలు తెలియజేశారు. షర్మిల పాదయాత్ర ఇవాళ 60వ రోజు చేరుకోవడమే కాదు.. రేగుళ్ల గ్రామంలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపడుతున్నారు.

రోజు రోజుకూ ఎండలు తీవ్రమవుతున్నా పట్టించుకోకుండా షర్మిల పాదయాత్ర యధావిధిగా కొనసాగుతుండగా.. నాయకులు, కార్యకర్తలు కూడా అదే ఉత్సాహంతో పాల్గొంటున్నారు. చాలా కాలం తర్వాత తెలంగాణలో పాదయాత్ర చేస్తూ.. దారిపొడవునా ప్రజలతో మాటా మంతీ జరుపుతూ.. కష్ట సుఖాలు తెలుసుకుని ఓదారుస్తూ ముందుకు సాగుతున్నారు. సమస్యలు, కష్టాలు ఎదుర్కొంటున్న వారికి అండగా ఉంటానని భరోసా ఇస్తుండడంతో జనం కూడా షర్మిల పాదయాత్రకు భారీగా తరలివచ్చి తమ కష్ట సుఖాలు తెలుపుకుంటున్నారు. రాష్ట్రం వచ్చిందన్న సంతోషం లేకుండా పోయిందని.. పాలకులు పట్టించుకోవడం లేదంటూ ప్రజలు షర్మిల వద్ద వాపోతున్నారు. 

 

 

ఇవి కూడా చదవండి

ఏపీలో టూరిజం, కల్చర్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తా

ట్విట్టర్లో మరోసారి కేంద్రంపై కేటీఆర్ విమర్శలు

అప్పుల మీద అప్పులు .. జీతాలు, పింఛన్లు, ఖర్చులకు కటకట