ట్విట్టర్లో మరోసారి కేంద్రంపై కేటీఆర్ విమర్శలు

ట్విట్టర్లో మరోసారి  కేంద్రంపై కేటీఆర్ విమర్శలు

కేంద్రంపై మరోసారి విమర్శలు చేశారు మంత్రి కేటీఆర్. భారతదేశంలో నిరుద్యోగం 45 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుందన్నారు. ద్రవ్యోల్బణం 30 సంవత్సరాల గరిష్టానికి..  ఇంధన ధరలు ఆల్ టైమ్ రికార్డ్ కు చేరాయన్నారు. ఎల్పీజీ  సిలిండర్ ధర ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయన్నారు. వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోతున్నామని ఆర్బీఐ తెలిపిందన్నారు. ఇలాంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వమని పిలవాలా? లేక ఎన్పీఏ ప్రభుత్వమని పిలవాలా అని ప్రశ్నించారు. ఎన్డీఏ  పని చేయని ప్రభుత్వంగా  ( NPA = నాన్ పెర్ఫార్మింగ్ అసెట్) మిగిలిపోతుందన్నారు.