జగన్ మాట తప్పడు.. మడమ తిప్పడు: విజయమ్మ

జగన్ మాట తప్పడు.. మడమ తిప్పడు: విజయమ్మ

ఏపీలో జరుగుతున్న ఎన్నికలు  ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం అని అన్నారు వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ. ప్రకాశం జిల్లా కనిగిరి ఎన్నికల ప్రచారం నిర్వహించిన  విజయమ్మ ‘తొమ్మిదేళ్లుగా జగన్ బాబు మీలోనే ఉన్నాడు. మీరొకటి గుర్తుంచుకోండి. గత ఎన్నికల్లో కొద్ది మెజార్టీతో మనం ఓడిపోయాం. ఈసారి ఆ తప్పు చేయద్దని వేడుకుంటున్నాను. వైయస్ మరణం తర్వాత ఈ తొమ్మిదేళ్లలో మేము నష్టపోయిన దానికన్నా  ఈ రాష్ట్రం నష్టపోయింది‘ ఎక్కువ అన్నారు.

‘వైఎస్సార్ మరణం తర్వాత సాగిన పాలన చూస్తే బాధేస్తోంది. ప్రజల కష్టాలు చూస్తుంటే బాధగా ఉంది. ఈ తొమ్మిదేళ్లలో జగన్ బాబు మీతోనే ఉన్నాడు. ఒకటే చెప్తున్నా జగన్ అనుకుంటే చేస్తాడు.. సాధిస్తాడు. మాట తప్పడు మడమ తిప్పడు.  వివేకానంద హత్య విషయంలో జగన్ పై ఆరోపణలు చేస్తున్నారు. రాజారెడ్డి హత్య కేసు నిందితుడు తిరుగుతున్నా చట్టం తన పని తాను చేసుకుపోతుందని వైఎస్ అన్న విషయాన్ని గుర్తు చేసుకోండి. వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐకి  ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబునాయుడు ప్రజలకు ఏం చేశారో చెప్పడం లేదు కాబట్టి చంద్రబాబు కు ఓటు అడిగే హక్కు ఉందా? చంద్రబాబుకు మూడు నెలల ముందు ప్రజలు గుర్తుకు వస్తున్నారు. నవరత్నాలను కాపీ కొడుతున్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వుంది. ఎన్ని వాతలు పెట్టుకున్నా పులి పులే.. నక్క నక్కే‘ అని అన్నారు.