
- గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డిని ప్రశ్నిస్తున్న సిట్
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆయన అనుచరులు గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డిని ప్రశ్నిస్తోంది. గంగిరెడ్డితో పరమేశ్వర్‌రెడ్డి చేతులు కలిపినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగళూరులో ఓ భూవివాదంలో వివేకా, గంగిరెడ్డి మధ్య గొడవ జరిగినట్లుగా భావిస్తున్నారు. రూ.125 కోట్ల సెటిల్‌మెంట్ వ్యవహారంలో వివాదం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఈ డీల్‌లో రూ.1.5 కోట్ల లావాదేవీలపై సిట్ ఆరా తీస్తోంది. నాలుగు రోజులుగా గంగిరెడ్డిని రహస్య ప్రాంతంలో సిట్ అధికారులు చారిస్తున్నారు. మరో అనుమానితుడు పరమేశ్వర్‌రెడ్డిని తిరుపతిలోని ఆస్పత్రిలో అదుపులోకి తీసుకున్నారు. పరమేశ్వర్ రెడ్డి అనుచరులు సిం హాద్రిపురం మండలం కతనూరుకు చెం దిన శేఖర్‌రెడ్డి, సునీల్ యాదవ్ తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు వేర్వేరుగా విచారిం చారు. గుండెపోటుతో చనిపోయారని తాను చెప్పలేదని అవినాశ్ మీడియాతో అన్నారు. వైఎస్ వివేకా కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్‌లను పోలీసులు కడపలో విచారించారు. ఆస్తి తగాదాలు, కుటుం బంలో వ్యక్తిగత విభేదాలపై ఆరా తీశారు. మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించేలా ఆదేశిం చాలని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్రగడ్డ అనిల్ హైకోర్టులో మంగళవారం పిల్ వేశారు.