రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా.. ? కేసీఆర్ రాజకీయాలకు భూములు కరువా..? : వైఎస్ షర్మిల

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా.. ? కేసీఆర్ రాజకీయాలకు భూములు కరువా..? : వైఎస్ షర్మిల

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా.. ? కేసీఆర్ రాజకీయాలకు భూములు కరువా..? అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ  అధ్యక్షురాలు షర్మిల ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. కమీషన్ల పేరు చెప్పి ఖజానానే పొతం పట్టించిన దొర.. సర్కారీ భూములను సైతం వదలడం లేదంటూ ఆరోపించారు. 

ఒక రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీకి రెండు కార్యాలయాలా..? అని వైఎష్ షర్మిల ప్రశ్నించారు. పార్టీ పేరు మార్చినంత మాత్రాన.. కొత్త భవనానికి సర్కారు భూమి ఇవ్వడమా..? అని పేర్కొన్నారు. 

https://twitter.com/realyssharmila/status/1666026413152145409

‘‘దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వడానికి భూములు ఉండవు.36 లక్షల మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టడానికి భూములు దొరకవు. అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు భూములు ఉండవు. చివరకు జర్నలిస్టులకు ఇవ్వడానికి స్థలాలు దొరకవు. కానీ.. దొర విలాసాలకు, పార్టీ కార్యాలయాలకు, ఎక్స్ లెన్స్ సెంటర్లకు మాత్రం అడగ్గానే భూములు దొరుకుతాయి’’ అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.