ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్

ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లి ముందస్తు బెయిల్  పిటిషన్

ఏపీ హైకోర్టును ఆశ్రయించారు మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈవీఎం ధ్వంసం ఘటనలో ఈసీ కేసుకు సంబంధించి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు పిన్నెల్లి. కాసేపట్లో పిన్నెల్లి పిటిషన్ పై విచారణ చేపట్టనుంది హైకోర్టు. 

మే 13న పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఏ1 గా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై  ఇప్పటికే  లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు.  పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక టీంలతో గాలిస్తున్నారు. మే 22న హైదరాబాద్ లో పిన్నెల్లి  కారును గుర్తించారు.  డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు పిన్నెల్లి లొంగిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పోలీసులు నరసరావు పేట కోర్టుదగ్గర భారీగా భద్రత ఏర్పాటు చేశారు.