బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ నదియా ఖానం

బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ నదియా ఖానం

వైసీపీ ఎమ్మెల్సీ, ఏపీ శాసనమండడలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం (మే 14) ఎమ్మెల్సీ పదవికి, వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తన పదవికి రాజీనామా చేసిన వెంటనే నేరుగా విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయాని వెళ్లారు. అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

 జకియా ఖానమ్ బీజేపీలో చేరడంతో పార్టీకి మరింత బలం చేకూరిందని అన్నారు పురందేశ్వరి. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ లో భాగంగా కుల, మతాలకు అతీతంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని అన్నారు. ప్రధాని మోదీ అందరికీ సమాన హక్కులు కల్పిస్తున్నారని, ముస్లిం మహిళలకు భరోసా ఇస్తున్నారని ఈ సందర్భంగా జకియా ఖానమ్ అన్నారు. 

జకియా ఖానమ్ టీడీపీ లేదా జనసేన పార్టీల్లో చేరతారని ప్రచారం జరిగింది. కానీ ఆమె మాత్రం ఊహించని విధంగా బీజేపీలో చేరారు.

బీజేపీలో చేరిన జకియా ఖానమ్‌ది అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం. 2021లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. అయితే కొంతకాలంగా వైఎస్సార్‌సీపీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో కొద్ది నెలల క్రితం మంత్రి లోకేష్‌ను కలిశారు.. అప్పుడే టీడీపీలోచేరతారని ప్రచారం జరిగింది. ఇంతలో బీజేపీలో చేరడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.