మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలి

మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలి

సూర్యాపేట  మార్కెట్ యార్డు  ముందు  YSRTP అధ్యక్షురాలు  షర్మిల ధర్నా  చేపట్టారు. మార్కెట్ యార్డులో  రైతులతో  ధాన్యం కొనుగోళ్లపై  చర్చించారు. ధాన్యాన్ని తక్కువ  ధరకు  కొనుగోలు చేస్తున్నారని  రైతులు చెప్పటంతో  మార్కెట్  అధికారులను షర్మిల నిలదీశారు.  రైతులు మోసపోతున్నారు  కాబట్టే  వారిలో ఆందోళన  కనిపిస్తుందన్నారు. చాలామంది రైతులకు  మోసం జరుగుతుంటే  ఏం చేస్తున్నారంటూ  ప్రశ్నించారు. ప్రభుత్వానికి  రైతుల పట్ల సింపతి  లేదన్నారు . అన్నదాతలు  ధాన్యాన్ని తక్కువ ధరకు  అమ్ముకుంటే.. ఇక కొనుగోలు సెంటర్లు ఎందుకని ప్రశ్నించారు. 

మరిన్ని వార్తల కోసం

ఐస్ క్రీమ్ అమ్ముకుంటున్న పారా అథ్లెట్ సచిన్ సాహు

కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యండిల్ ను బ్లాక్ చేసిన కేటీఆర్