షర్మిల పాదయాత్రకు అనూహ్య స్పందన

షర్మిల పాదయాత్రకు అనూహ్య స్పందన

సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో ప్రజాప్రస్థానం యాత్ర కొనసాగిస్తున్నారు YSRTP అధ్యక్షురాలు షర్మిల. బరాకత్ గూడెం నుంచి 104వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. చిల్కూర్ మండలం పోలేని గూడెం, బేతవోలు, చెన్నారి గూడెం గ్రామాల మీదుగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యాత్ర కొనసాగిస్తున్నారు షర్మిల. మునగాల మండలం వెలిదండ క్రాస్, గణపవరం గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్ర గణపవరం గ్రామస్థులతో మాట ముచ్చట నిర్వహించనున్నారు షర్మిల.